top of page
MediaFx

‘రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు’.. ఓటమి తరువాత వైఎస్ జగన్ తొలి ప్రెస్‎మీట్..


పిన్నెల్లి మీద అన్యాయంగా కేసులు పెట్టి నిర్భందించారన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు సెంట్రల్ జైలులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అనంతరం మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నిలక సమయంలో పెట్టిన కేసులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు నెల్లూరు వచ్చారు వైఎస్ జగన్. అయనతో నెల్లూరు సెంట్రల్ జైలులో ములాఖత్ అయిన తరువాత ప్రస్తుత ప్రభుత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులే తమ పై దాడి చేసి తిరిగి కేసులు పెడుతున్నారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ చూడలేదన్నారు వైఎస్ జగన్. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారని విమర్శించారు. వైయస్‌ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారని మండిపడ్డారు. ఈ పాపాలన్నీ శిశుపాలుడి పాపాలలా పెరుగుతున్నాయని అభివర్ణించారు. దాడులతో భయపెట్టి చేసే రాజకీయాలు సరికాదని సూచించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం తమ ధోరణి మార్చుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. ప్రజల్లో వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి హామీల వల్లే 10శాతం ఎక్కువ మంది ప్రజలు ఎన్డీయేకు ఓటు వేశారన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.కారంపూడిలో టీడీపీ అకృత్యాలకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం ఇబ్బంది పడిందన్నారు. డీఎస్పీ అనుమతితో వైసీపీ కార్యకర్తల పరామర్శకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వెళ్లారని చెప్పారు. సీఐ నారాయణ స్వామి కనీసం పిన్నెల్లికి ఎదురు పడలేదన్నారు. పిన్నెల్లిపై ఘటన జరిగిన రోజు కేసు పెట్టలేదని తెలిపారు. కారెంపూడి ఘటన తన్వాత వారం రోజులకు పిన్నెల్లిపై 307 సెక్షన్ నమోదు చేశారన్నారు. కారెంపూడి ఘటన జరిగిన 10 రోజుల తర్వాత.. పిన్నెల్లిపై కక్షపూరితంగా హత్యాయత్నం కేసు పెట్టారని చెప్పారు వైఎస్ జగన్. మే17-20 వరకు ఉన్న సిట్ రిపోర్ట్‌లో హత్యాయత్నం కేసు లేదని వివరించారు. పిన్నెల్లి మంచోడు కాబట్టే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొన్నారు. పిన్నెల్లి లాంటి వారిని తప్పుడు కేసులతో నిర్భందించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రం వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులపై దాడులు చేస్తున్నారన్నారు. అన్నింటినీ న్యాయపరంగా అధిగమిస్తామని ధీమాను వ్యక్తం చేశారు.

bottom of page