పవన్ రీ రిలీజ్ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్..
- Srinivas Cheepuri
- Apr 10, 2023
- 1 min read
టాలీవుడ్ లో రీ రిలీజ్ చిత్రాల ట్రెండ్ బాగా ఎక్కువవుతోంది. పవన్ కళ్యాణ్ ఖుషి, జల్సా చిత్రాలు రీ రిలీజ్ లో రికార్డులు క్రియేట్ చేయడంతో ఇతర స్టార్ హీరోల చిత్రాలు కూడా రిలీజ్ కి క్యూ కడుతున్నాయి.

టాలీవుడ్ లో రీ రిలీజ్ చిత్రాల ట్రెండ్ బాగా ఎక్కువవుతోంది. పవన్ కళ్యాణ్ ఖుషి, జల్సా చిత్రాలు రీ రిలీజ్ లో రికార్డులు క్రియేట్ చేయడంతో ఇతర స్టార్ హీరోల చిత్రాలు కూడా రిలీజ్ కి క్యూ కడుతున్నాయి. ఎన్టీఆర్ ఆంధ్రావాలా, రాంచరణ్ ఆరెంజ్, అల్లు అర్జున్ దేశముదురు చిత్రాలు రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
ఇక త్వరలో పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ చిత్రం కూడా రీరిలీజ్ కి సిద్ధం అవుతోంది. గుడుంబా శంకర్ తొలిసారి 2004లో రిలీజ్ అయింది. ఆ సమయంలో ఈ చిత్రం కేవలం యావరేజ్ మూవీగా మాత్రమే నిలిచింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ధరించిన డబుల్ ప్యాంట్ అప్పట్లో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. వీరశంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మణిశర్మ అందించిన పాటలు యువతని ఉర్రూతలూగించాయి. ఈ చిత్రం త్వరలో రీరిలీజ్ కి రెడీ అవుతుండడంతో పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర రీరిలీజ్ గురించి అదిరిపోయే బజ్ వైరల్ గా మారింది. రీ రిలీజ్ అవుతున్న గుడుంబా శంకర్ చిత్రానికి తొలిసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ లో ఇది కొత్త ట్రెండ్ లాగా మారుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. గుడుంబా శంకర్ రీరిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి ప్రముఖ దర్శకులు, నిర్మాతలు హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. ఆరెంజ్ చిత్రం కూడా నాగబాబు నిర్మాణంలో తెరకెక్కింది. మొదటి సారి రిలీజ్ అయినప్పుడు డిజాస్టర్ గా నిలిచిన ఆరెంజ్.. రీరిలీజ్ లో అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు గుడుంబా శంకర్ రీరిలీజ్ అవుతుండడంతో నాగబాబుకి భలే కలసి వస్తోంది అని కామెంట్స్ చేస్తున్నారు.